Professor Jaya Shankar BadiBata Programme 2018-2019 in TS Schools

TS Schools BadiBata Programme: Telangana Schools "Professor Jaya Shankar badibata" Programme Activities, Guidelines 2018-2019. TS Schools Students Enrolment drive. Badibata Schedule Activities  Guidelines; Badibata day wise programme Activities.


బడిబాటలో రోజువారీ కార్యక్రమాలు:
2018-2019: జూన్ 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ బుధవారం విడుదల చేశారు. ఐదురోజులపాటు నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల గురించి గ్రామీణ ప్రాంతవాసులకు తెలియచేయడంతో పాటు ఇంటింటి ప్రచారం చేయాలన్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట నిర్వహించాలని షెడ్యూల్‌ను ప్రకటించారు.

1. జూన్ 4:
-జూన్ 4వ తేదీన మన ఊరిబడి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. గ్రామాల్లో బ్యానర్లతో ర్యాలీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల గురించి వారికి వివరించడంతోపాటు, నాణ్యమైన విద్యను పెంపొందించడానికి తీర్మానాలు చేయాలి.


2. జూన్ 5:
- జూన్ 5వ తేదీన బాలికల విద్యపై దృష్టిసారించాలి. వారికి మార్షల్ ఆర్ట్స్, జీవన నైపుణ్యాల వంటివాటిపై శిక్షణ ఇవ్వాలి. బాలికల విద్య ప్రాధాన్యం తెలియజేసేలా మహిళా అధికారులతో ఉపన్యాసాలు ఇప్పించాలి.


3. జూన్ 6:
-జూన్ 6వ తేదీన సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి. ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.


4. జూన్ 7:
- జూన్ 7వ తేదీన స్వచ్ఛపాఠశాల /హరితహారం నిర్వహించాలి. ప్రతి తరగతి గదిని పరిశుభ్రంగా తయారుచేయాలి. పాఠశాల ఆవరణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. మరుగుదొడ్ల నిర్వహణ కోసం నీటి సదుపాయాన్ని కల్పించాలి.



5. జూన్ 8:
- జూన్ 8వ తేదీన బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చించాలి. పనికోసం వలసవచ్చినవారి పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్చేలా అవగాహన కల్పించాలి. మండల టాస్క్‌ఫోర్స్ కమిటీతో కలిసి బాలకార్మికులకు విముక్తి కల్పించి వారిని పాఠశాలల్లో చేర్పించాలి.

Rc.No.1056,Dt:30-05-2018 - C and DSE, SPD, SSA, Telangana:: Samagra Shiksha Abhiyan - CMO Wing - Activities - Conduct of Professor Jaya Shankar BadiBata Programme for the year 2018-19 from 04.06.2018 to 08.06.2018.

TS Schools BadiBata Programme:

Professor Jaya Shankar BadiBata Programme 2018-2019 in TS Schools

0 comments:

Post a Comment