'GREEN DAY' in all schools on 15-07-2017 under Telanganaku Haritha haram(Haritha Patashala)

PROCEEDINGS OF THE DISTRICT EDUCATIONAL OFFICER AND EX-OFFICIO DISTRICT PROJECT OFFICER, SSA- MAHABUBABAD
Proc. Rc. No.1407/A4/2017. Date. 14.07.2017

Sub: School Education – Haritha haram certain instructions issued –Reg

Ref:
1. Proceedings of the Director of School Education & Ex-Officio SSA, Telangana
Proc.Rc.No.77/PS-2-1/2015, Dated 12.07.2017.

In the reference cited, the Commissioner & Director of School Education & Ex- Officio State Project Director, TSSA, Hyderabad, has issued instructions to make arrangements well in advance and to organize “GREEN DAY” in all schools on 15-07-2017 and furnish the information in Proforma-I and proforma –II along with documentation on GREEN DAY.

While communicating the targets finalized by the Commissioner & Director of School Education & Ex-Officio State Project Director, TSSA, Hyderabad, all the Mandal Educational officers and Head masters / Principals in the district are requested to make arrangements well in advance and to organize “GREEN DAY” in all schools on 15-07-2017 and furnish the information in Proforma-I and Proforma –II along with documentation on GREEN DAY every day by 05. Pm . Any deviation in the matter will be viewed seriously and they are held responsible.

*Telanganaku Haritha haram, *Haritha Patashala, *Haritha Schools, *Green Day


గ్రీన్ డే... పాఠశాల విద్యార్థుల హరిత ఉద్యమం:
జూలై 15వ తేదీన హరిత తెలంగాణలో ప్రత్యేక రోజుగా లిఖించనున్నారు.
మూడో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే పండగను విద్యాశాఖ ఒక యజ్ణంగా నిర్వహించడానికి సిద్ధమైంది.

జూలై 15వ తేదీని గ్రీన్ డేగా పాటిస్తూ తెలంగాణ పాఠశాలలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యక్రమం రూపొందించింది.

ఉదయం 8.30 గంటల నుంచి గ్రీన్ డే ప్రారంభం కానుంది.
ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రతి పాఠశాల వద్ద హరిత పాఠశాల- హరిత తెలంగాణ పేరుతో నినాదాలిస్తూ మొక్కల ఆవశ్యకతను గ్రామంలో, పట్టణంలో తెలియజేసే విధంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించనున్నారు.

హరితహారంలో కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటిని సంరంక్షించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటిన మొక్కలను దత్తత తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవడమే ఈ గ్రీన్ బ్రిగేడ్ల లక్ష్యం.

నేడు బడుల్లో గ్రీన్‌డే:
పిల్లలు, మొక్కలు భవిష్యత్ తరాలకు పునాదులు. ఆకాశమంత ఎదిగే అవకాశాలు. అదే పిల్లల చేతుల్లో మొక్కలుంటే.. అవి బంగారు తెలంగాణకు బాటలు అంటూ శనివారం గ్రీన్‌డే సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయనున్నారు. 

హరిత తెలంగాణ కోసం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో గ్రీన్ డే నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 వరకు 28 లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హరిత పాఠశాలల నుంచే హరిత తెలంగాణ అంటూ నినదించనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.

ఉదయం 8.30 నుంచి 9.30 వరకు హరితహారంపై గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, ఉదయం 9.30 నుంచి 10.30 వరకు 28 లక్షల మొక్కలు నాటుతారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హరితహారం కార్యక్రమంపై పాఠశాలస్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, నాటికలు, క్విజ్ వంటి పోటీలను నిర్వహించి, విజేతలకు ఆగస్టు 15న బహుమతులు అందించనున్నారు. 

ప్రజాప్రతినిధులు, స్థానికులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున మొక్కలను నాటి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జిల్లాలవారీగా డీఈవోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు మొక్కలను నాటేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. మొక్కలను సంరక్షించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులే గ్రీన్ బ్రిగేడ్‌గా వ్యవహరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Source: www.DEOMahabubabad.In

0 comments:

Post a Comment