PRC 2015 Arrears Payment Guidelines, Arrears from 02.06.2014 to 28.02.2015

PRC 2015  Arrears Payment Guidelines, Arrears from 02.06.2014 to 28.02.2015/ Payment of RC 2015 Arrears for the period from 02.06.2014 to 28.02.2015

PRC 2015 Arrears Payment Guidelines, Arrears from 02.06.2014 to 28.02.2015
June నెల నుంచి పీఆర్సీ బకాయిలు చెల్లింపు:
Circular Memo no. 647, Dt.13.06.2017 :: PRC 2015 - Payment of Arrears for the period from 02.06.2014 to 28.02.2015 - procedural instructions - issued.
పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) 2015 ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు వచ్చేనెల (జూన్ నెల జీతంతో కలిపి) నుంచి పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. చెల్లింపులు ఎలా ఉండాలనే విషయమై ట్రెజరీ విభాగం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారులకు ఆర్థిక శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

2 జూన్ 2014 నుంచి 28 ఫిబ్రవరి 2015 వరకు ఉన్న బకాయిలను వాయిదాల పద్ధతిన చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
Phase I: రివిజన్ పే స్కేల్ ప్రకారం 50శాతం బకాయిలను 2017-18 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాలని సూచించింది.
Phase II: మిగతా మొత్తాన్ని 2018-19వ ఆర్థిక సంవత్సరాంతానికి చెల్లిస్తారు. బకాయిలను మొత్తం 18 వాయిదాల్లో అందజేస్తారు. హెచ్‌ఆర్‌ఎంఎస్ ప్యాకేజీ కింద 060-ఎఫ్‌ఆర్‌సీ ఏరియర్స్ ప్రత్యేక అకౌంట్ కింద చెల్లించాలని సూచించింది.

తుది దశలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు చెల్లించనుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ బకాయిలను ప్రత్యేకంగా 8793-ఇంటర్ స్టేట్ సస్పెన్స్ అకౌంట్స్ కింద చెల్లిస్తారు. తర్వాత ఇంటర్ స్టేట్ అడ్జస్ట్‌మెంట్ కింద లెక్కలు సర్దుబాటు చేసుకుంటామని అధికారులు తెలిపారు.

PRC 2015 ఏరియర్స్ గైడ్ లైన్స్ ముఖ్యాంశాలు:
a. PRC arrears బిల్లులను ఆన్ లైన్ లోనే 060-PRC Arrears అనే పద్దు కింద సమర్పించాలి. HRMS package(DDO Request) లో చెయ్యని బిల్లులు తీసుకోబడవు.
b. 02.06.2014 తర్వాత transfer ఐనవారు ప్రస్తుత స్థానం నుండే బిల్లులు సమర్పించాలి.
c. లీవు, సస్పెన్షన్ లలో ఉన్నవారి arrears ఆ కాలం regularize అయిన తర్వాతనే చేసుకోవాలి.
d. Arrears కాలంలో ఫారెన్ సర్వీస్ లో ఉన్నవారికి ఫారెన్ డిపార్ట్మెంట్ నుండి, ఒకవేళ ఆ పీరియడ్ తర్వాత ఫారెన్ డిపార్ట్మెంట్ కు వెళ్ళితే పీరియడ్ కాలంలో ఉన్న డిపార్ట్మెంట్ నుండి arrears చెల్లిస్తారు.
e. సీపీయస్ ఉద్యోగులకు arrears నుండి pay, DA కలిపి 10శాతం మినహాయిస్తారు.
f. మొదటి నెల ఇంస్టాల్ మెంట్ Arrears బిల్లులు సమర్పించే సమయంలో DDO లు Appendix-II ను తప్పనిసరిగా సమర్పించాలి.
g. (Appendix II అనేది PRC pay fixation చేసినప్పటి బిల్లులో ఉండే డిటైల్డ్ అమౌంట్ ప్రొఫార్మా.)
DDO లు ఒక సపరేట్ రిజిస్టర్ ను ఈ సర్కులర్ తో పాటు జతచేయబడిన ప్రొఫార్మాలో సూచించబడిన అంశాలతో maintain చేస్తారు.
h. ప్రతి ఎంప్లాయ్ యొక్క ఆధార్ ను కూడా ఈ సందర్భంగా DDO లు సేకరిస్తారు.

0 comments:

Post a Comment