2nd Spell Prof. Jaya Shankar Badi Bata Day wise Programmes, Activities, Guidelines

2nd Spell Badi Bata Day wise Programmes, Activities, Guidelines:

పాఠశాలలు పునఃప్రారంభమైన మరుసటి రోజు (ఈ నెల 13) నుంచి 17 వరకు ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా బడిబాట నిర్వహించనున్నారు.
-13న మన ఊరు - మన బడి బాట సర్వే:ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రతీ పిల్లవాడిని బడిలో చేర్పించడం, 30 మంది కన్న తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచేందుకు పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆంగ్ల మాద్యమాన్ని ప్రారంభించడం కోసం పాఠశాలల్లో సౌకర్యాలు, సంసిద్ధతలపై చర్చించాల్సి ఉంటుంది.

- 14న రెండవ రోజు పిల్లల ఆరోగ్య పరీక్షల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రాథమిక ఆర్యోగ కేంద్రం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేపిస్తారు. విద్యార్థుల ఆధార్ సేకరణ, ఇంటింటికెళ్లి ప్రచార కరపత్రాలను పంచడం, బడి బయట పిల్లల తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించుటకు ఒప్పించనున్నారు.

- 15న బాలికల రోజులో భాగంగా కస్తూర్బా బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు ఆ విద్యాలయంలో చేరే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మౌలిక వసతులను చూపించడం, ఇంటింటికీ వెళ్లి ఆడపిల్లల ప్రత్యేకతలను వివరించాల్సి ఉంటుంది.

-16 తేదీన స్వచ్ఛ పాఠశాల-హరితహారంలో భాగంగా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, నల్లబల్లలకు రంగులు వేయడం, వృథా సామగ్రిని తొలగించి ఫర్నిచర్‌ను శుభ్రం చేయడం. పాఠశాలల్లో కొన్ని ఏళ్లుగా వృథాగా ఉంటున్న సామగ్రిని తొలగించడానికి పాఠశాల యాజమాన్య కమిటీ, పాఠశాల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానించాల్సి ఉంటుంది.

- 17న బాలకార్మికుల విముక్తిలో కార్యక్రమంలో భాగంగా పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్, లేబర్ డిపార్ట్‌మెంట్, ఎన్‌జీవోల సహకారంతో సర్వే నిర్వహించి బాలకార్మికులను విముక్తి కలిగించి కేజీబీవీల్లో చేర్పించడం. ఉపాధ్యాయుల, కమిటీ సమావేశాలు నిర్వహించి పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలు, పాఠశాలల ఫలితాలు, బడి బయట పిల్లల నమోదుపై చర్చించాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment